Saptami Gowda: 'కాంతార' బ్యూటీకి తెలుగు తెర కలిసొచ్చేనా?

Saptami Gouda Special
  • నితిన్ హీరోగా రూపొందిన 'తమ్ముడు'
  • జులై 4వ తేదీన సినిమా విడుడల 
  • టాలీవుడ్ కి పరిచయమవుతున్న సప్తమీ గౌడ
  • ఆల్రెడీ 'హిట్ 3'తో హిట్ కొట్టిన శ్రీనిధి శెట్టి

కన్నడ నుంచి ఎప్పటికప్పుడు తెలుగు తెరపైకి హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. తమ గ్లామర్ తో .. నటనతో ఇక్కడ దూసుకుపోతూనే ఉన్నారు. సౌందర్య తరువాత కూడా చాలామంది కన్నడ భామలు టాలీవుడ్ కి వచ్చారు. టాలెంటుతో పాటు కొంతమందికి అదృష్టం కూడా తోడు కావడంతో తమ జోరును కొనసాగిస్తున్నారు. అలా ఈ మధ్యలో కన్నడ నుంచి వచ్చిన రష్మిక, ఒక రేంజ్ లో తన సత్తా చాటుతోంది. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలు పరిగెడుతున్నాయి. దాంతో ఆయా సినిమాలలోని హీరోయిన్స్ కి కూడా మిగతా భాషల నుంచి ఆఫర్స్ రావడం మొదలైంది. అలా కన్నడ వైపు నుంచి వచ్చిన 'కేజీఎఫ్' ద్వారా శ్రీనిధి శెట్టి .. 'కాంతార' ద్వారా సంయుక్తా మీనన్ ప్రేక్షకులను అలరించారు. ఈ బ్యూటీలను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి ఇక్కడి మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వెళ్లారు. 

మొత్తానికి 'హిట్ 3' సినిమాతో శ్రీనిధి శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన ఆకర్షణీయమైన రూపంతో ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలోనే సప్తమీ గౌడ కూడా 'తమ్ముడు' సినిమాతో నితిన్ సరసన మెరవనుంది. 'కాంతార' సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సుందరి, తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఇక్కడి ఫ్యాన్స్ వెయిట్ చేశారు. వాళ్ల ముచ్చట 'తమ్ముడు'తో తీరనుంది. జులై 4న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో సప్తమి ఇక్కడ గట్టి హిట్టే కొడుతుందేమో చూడాలి మరి. 
Saptami Gowda
Kantara
Thammudu Movie
Nithin
Telugu cinema
Tollywood
Kannada actresses
Srinidhi Shetty
Rashmika Mandanna
Hit 3

More Telugu News