Air India: ఎయిరిండియా క్రాష్... ప్రమాదానికి ముందు 'మేడే కాల్' చేసిన పైలట్

Air India Crash Pilot Made Mayday Call Before Accident
  • అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
  • కుప్పకూలిన లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం
  • మేడే కాల్ కు స్పందించని ఏటీసీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం... బోయింగ్ 787 రకానికి చెందినది. ఇది అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రన్‌వే 23 మీదుగా మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి 'మేడే కాల్' జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే 'మేడే కాల్' అంటారు. అయితే, ఈ 'మేడే కాల్'కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ పేర్కొనడం గమనార్హం.
Air India
Air India crash
Ahmedabad
Flight AI 171
Boeing 787
Sardar Vallabhbhai Patel International Airport
DGCA
Mayday call
Plane crash
London Gatwick Airport

More Telugu News