Keir Starmer: కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

Keir Starmer Shocked by Air India Plane Crash in Ahmedabad
  • అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
  • లండన్ వెళుతున్న విమానం కుప్పకూలిన వైనం
  • విమానంలో 242 మంది ప్రయాణికులు... వారిలో 53 మంది బ్రిటన్ జాతీయులుసలిపోవడంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందన
  • ఘటన దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయన్న స్టార్మర్
  • పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలింది. ఇందులో 242 మంది ఉండగా, వారిలో 53 మంది బ్రిటన్ పౌరులే.

ఈ ఘటనపై కీర్ స్టార్మర్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో, లండన్ బయల్దేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయి" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
Keir Starmer
Air India plane crash
Ahmedabad
British citizens
UK Prime Minister
London flight
India plane accident
Plane crash victims

More Telugu News