Perni Nani: మానసికంగా చచ్చిపోయాను: పేర్ని నేని కంటతడి

- తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్న పేర్ని నాని
- నమ్మిన వ్యక్తే తనను మోసం చేశాడని ఆవేదన
- తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని వ్యాఖ్య
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైసీపీ కేడర్‌పై దాడులు చేయించారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని పేర్ని నాని విమర్శించారు. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఆ మధ్య రోజుల్లో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే అని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయని, జగన్ జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి పైశాచిక ఆనందం పొందారని, భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేశారంటూ కాకాణి గోవర్ధన్‌పై, బందరులో ఎవరో తలలు పగలుకొట్టారని కొడాలి నానిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన మీద, తన భార్య మీద కూడా రేషన్ బియ్యం కేసు పెట్టారని నాని వాపోయారు.
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పేర్ని నాని వివరణ ఇస్తూ, "నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే... ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది" అని తెలిపారు. గోదాములో బియ్యం కొరత ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారని, రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే, కోటి రూపాయలు అదే రోజు కట్టామని, మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పినా, అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారని ఆయన వివరించారు. ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందనే కారణంగానే కేసు పెట్టారని ఆరోపించారు. "22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళితే ఫైన్ కట్టించుకుని వదిలేయమని చెప్పింది" అని గుర్తు చేసుకున్నారు.
"పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు లేవు... ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా" అంటూ పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. తన భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, "మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా" అని అన్నారు. తన భార్యకు బెయిల్ వచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరిందని, అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో వ్యాపారాలు పెట్టొద్దని ఆయన సూచించారు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ‘నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికి చేరేనా?’ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్తపై పేర్ని నాని మండిపడ్డారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్‌లో మచిలీపట్నంకు సంబంధించి పోర్ట్, ఇళ్ల పట్టాల సమస్యను ప్రస్తావించామని, అధికారంలోకి రాగానే రైతుల నుంచి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారని, అయినా కూడా 15,400 మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి కూడా పట్టాలు ఇచ్చామని వివరించారు.
"అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మంది లబ్ధిదారులకు ఆన్ లైన్ అయి.. సచివాలయం నుంచి మున్సిపల్, అక్కడ నుంచి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, సీసీఎల్‌ఏలో అప్రూవ్ అయ్యింది. అప్లికేషన్ నంబర్ల నుంచి వాటి సరిహద్దులతో సహా ఆన్ లైన్‌లో అన్ని వివరాలు ఉన్నాయి" అని పేర్ని నాని స్పష్టం చేశారు. "జగన్ పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. 500 ఎకరాలకు సంబంధించి పొలం అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళున్నారని, ఎంతకు అమ్మారు, పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా అని అడుగుతున్నారని ఆరోపించారు. "ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్‌లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?" అని నిలదీశారు. తాను పట్టాలు పంచిన సందర్భంలో తన పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా ఉన్నారని, మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా, ఆయన సంతకం పెట్టకుండా పట్టాలు ఎలా పంచిపెడతారని ప్రశ్నించారు. "ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్‌వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా?" అని పేర్ని నాని సవాల్ విసిరారు.