Narendra Modi: నేడు అహ్మదాబాద్ కు వెళుతున్న మోదీ... విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్న పీఎం

Narendra Modi to Visit Ahmedabad Plane Crash Site Today
  • అహ్మదాబాద్ లో నిన్న కుప్పకూలిన ఎయిరిండియా విమానం
  • దుర్ఘటనలో విమానంలోని 241 మంది మృతి
  • మృతుల కుటుంబాలను పరామర్శించనున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్ లో నిన్న పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, కింద ఉన్నవారితో కలిపి 265 మంది మరణించారు. ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.
Narendra Modi
Ahmedabad
Air India crash
Gujarat plane crash
Vijay Rupani
Boeing 787
India plane accident
Plane crash investigation
Gujarat accident
PM Modi visit

More Telugu News