Roja: నిజాయతీపరులైన జర్నలిస్టులకు ఈ తీర్పు వజ్రాయుధం లాంటిది: రోజా

Roja reacts to Supreme Court verdict on Kommineni Srinivasa Rao arrest
  • ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట
  • కొమ్మినేని అరెస్ట్ అక్రమమని తేల్చిన సర్వోన్నత న్యాయస్థానం
  • ఆయన్ను వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ
  • విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదని కోర్టు స్పష్టీకరణ
  • సుప్రీం తీర్పుపై వైసీపీ నేత రోజా హర్షం, రాజకీయ విమర్శలు
  • నిజాయతీపరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధం వంటి తీర్పని రోజా వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఆయన అరెస్ట్‌ను అక్రమమైనదిగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతేకాకుండా, శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎటువంటి సంబంధం లేదని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ పరిణామంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని గారి అరెస్ట్‌ను అక్రమమని సుప్రీంకోర్టు తేల్చింది. వెంటనే విడుదల చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం రక్షణపై ఇది గట్టి సందేశం. సాక్షి టీవీపై విషప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిది. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజాయతీపరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధంలాంటి తీర్పు" అని రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Roja
Kommineni Srinivasa Rao
Andhra Pradesh Press Academy
Supreme Court verdict
Journalist arrest
YSRCP
Freedom of speech
Sakshi TV
Red Book politics

More Telugu News