KCR: ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్య పరీక్షలు

- మాజీ సీఎం కేసీఆర్కు ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
- గచ్చిబౌలిలోని ఆసుపత్రికి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత
- డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ ఆరోగ్య తనిఖీల్లో భాగంగా ఆయన ఆసుపత్రికి వెళ్లారు.
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు.