Nandamuri Balakrishna: ఏలూరులో సందడి చేసిన బాలయ్య, సంయుక్త మీనన్

Nandamuri Balakrishna and Samyuktha Menon visit Eluru
  • ఏలూరులో ఓ నగల దుకాణాన్ని నటి సంయుక్తతో కలిసి ప్రారంభించిన నటుడు బాలకృష్ణ
  • అఖండ 2 తాండవం మూవీ గురించి ముచ్చటించిన బాలకృష్ణ
  • సెప్టెంబర్ 25న విడుదల కానుందని వెల్లడి
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని నటి సంయుక్తతో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తన తాజా మూవీ అఖండ 2 తాండవం గురించి బాలకృష్ణ ముచ్చటించారు. మూవీ నిర్మాణం పూర్తి అయిందని, చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. ఇటీవలే టీజర్ విడుదలైందని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు.

కాగా, నటుడు బాలకృష్ణ, నటి సంయుక్తను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
Nandamuri Balakrishna
Balakrishna
Samyuktha Menon
Eluru
Akhanda 2
Jewellery store launch
Telugu cinema
Hindupuram MLA
Movie release date
Viral video

More Telugu News