KCR: కేసీఆర్‌కు రెండో రోజూ ఏఐజీలో వైద్య పరీక్షలు

KCR Undergoes Medical Tests at AIG Hospital for Second Day
  • మరోసారి ఏఐజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్
  • ఈరోజు కూడా కొనసాగిన వైద్య పరీక్షలు
  • నిన్న శుక్రవారం కూడా గంటపాటు ఆసుపత్రిలోనే కేసీఆర్
  • డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఆయన వరుసగా రెండో రోజు ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం.

కేసీఆర్ నిన్న మధ్యాహ్నం కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు.

ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారని సమాచారం.
KCR
KCR Health
AIG Hospital
Nageshwar Reddy
Telangana News
BRS Party
Health Checkup
Gachibowli

More Telugu News