Nara Lokesh: సవాల్ చేస్తే సౌండ్ ఆగిపోయింది: నారా లోకేశ్ ఎద్దేవా

Nara Lokesh Slams Jagan Over Challenge Silence
  • వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు
  • 'తల్లికి వందనం' నిధులపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని లోకేశ్ సవాల్
  • గడువు ముగిసినా జగన్ రుజువులు చూపలేదని, క్షమాపణ చెప్పలేదని వెల్లడి
  • చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
  • శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన
ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ చేసిన ఆరోపణలపై సవాల్ విసిరితే స్పందన కరవైందని, ఇది ఆయన వైఖరికి నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు. "సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!" అంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా... న్యాయ సమరమా? తేల్చుకోండి" అంటూ జగన్ కు లోకేశ్ అల్టిమేటమ్ జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు, మిగతా రూ.2 వేలు పాఠశాలలు/కాలేజీల అభివృద్ధి నిధుల నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే, ఈ రూ.2 వేలు మంత్రి నారా లోకేశ్ జేబులోకి పోతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్ సవాల్ విసిరారు. 
Nara Lokesh
Jagan
YS Jagan
AP Politics
Talli ki Vandanam
Andhra Pradesh
YSRCP
TDP
Political Challenge
Corruption Allegations

More Telugu News