SBI: నేటి నుంచి ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు

SBI Home Loan Interest Rates Reduced Today
  • నేటి నుంచే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు
  • కొత్తగా హోమ్ లోన్  తీసుకునే వారితో పాటు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా ఈ వెసులుబాటు
  • ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన రేపో రేటు తగ్గింపును అనుసరిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్న ఎస్బీఐ 
ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలనుకునే వారికి, సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఎస్‌బీఐ శుభవార్త తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది.

ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొత్తగా గృహ రుణం తీసుకునే వారికే కాకుండా, ఇప్పటికే రుణం తీసుకున్న వారి నెలవారీ చెల్లింపుల భారం కూడా కొంతమేర తగ్గనుంది.

ఇదివరకే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ లు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రం తమ వడ్డీ రేట్లను ఇంకా తగ్గించలేదు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే.

వడ్డీ రేటు తగ్గడం వల్ల ఈఎంఐ చెల్లింపుల్లో కొంత భారం తగ్గుతుంది. ఉదాహరణకు, 20 లక్షల రూపాయల రుణాన్ని 20 సంవత్సరాల కాలానికి తీసుకుంటే, వడ్డీ రేటు 0.50 శాతం తగ్గడం వల్ల నెలవారీ ఈఎంఐ సుమారు వెయ్యి రూపాయల వరకు తగ్గుతుంది. రుణ మొత్తం పెరిగే కొద్దీ ఈఎంఐ తగ్గింపు కూడా పెరుగుతుంది. గృహ రుణం తీసుకోవాలనుకునేవారు, లేదా ఇప్పటికే రుణం పొందిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.

SBI
SBI Home Loan
Home Loan Interest Rates
RBI
Repo Rate
Bank of Baroda
Punjab National Bank
Home Loan EMI
Interest Rate Reduction

More Telugu News