IMD: బంగాళాఖాతంలో ఉపరతల ఆవర్తనం .. నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు

IMD Forecasts Rains in Andhra Pradesh Due to Bay of Bengal Circulation
  • నిన్న కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు
  • నేడు కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు
ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. 

IMD
India Meteorological Department
Andhra Pradesh Rains
Rayalaseema Rains
Coastal Andhra
Bay of Bengal Cyclone
Weather Forecast
Heavy Rainfall Alert
Fishermen Warning
Visakhapatnam

More Telugu News