Sangameshwara Temple: నీట మునిగిన సంగమేశ్వర క్షేత్రం.. వీడియో ఇదిగో!

--
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నీటిమట్టం ప్రస్తుతం 838 అడుగులకు చేరింది. దీంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వర క్షేత్రం మరోమారు నీళ్లలో మునిగింది. మరో 8 నెలల పాటు ఈ ఆలయం నదీ గర్భంలోనే ఉండనుంది. ప్రతి ఏటా కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు ఒదిగిపోయే అపురూప దృశ్యాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.