Ponguleti Srinivas Reddy: ‘స్థానిక’ ఎన్నికలపై పొంగులేటి కీలక ప్రకటన

Ponguleti Key Announcement on Local Elections


స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు.

క్యాబినెట్ సమావేశం ముగిశాక ఎన్నికల తేదీలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.
Ponguleti Srinivas Reddy
Telangana local body elections
Telangana elections schedule
MPTTC elections
ZPTC elections
Sarpanch elections
Municipal elections
Telangana cabinet meeting

More Telugu News