Nara Lokesh: నీట్ ర్యాంకర్లకు అభినందనలు తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh Congratulates NEET Rankers from Andhra Pradesh
  • నీట్ యూజీ 2025 ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
  • టాప్ 100 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి చోటు
  • విద్యార్థులను అభినందిస్తూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్
  • 19వ ర్యాంకుతో డి.కార్తీక్ రామ్ కిరీటి అగ్రస్థానంలో
  • రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రాణించడంపై మంత్రి సంతోషం
  • వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేయాలని విద్యార్థులకు పిలుపు
నీట్ యూజీ 2025 ఫలితాలు నిన్న విడుదల కాగా, ఏపీకి చెందిన విద్యార్థులు సత్తా చాటడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

"వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాశ్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్ లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉంది. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్ లో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను" అని వివరించారు.
Nara Lokesh
NEET UG 2024
AP NEET Rankers
Andhra Pradesh Education
Medical Entrance Exam
D Karthik Ram Kireeti
NEET Results
Education News Andhra Pradesh
Top NEET Rankers
Y Sameer Kumar

More Telugu News