Nara Lokesh: నేడు ఫాదర్స్ డే... చంద్రబాబును ఉద్దేశించి నారా లోకేశ్ ట్వీట్

Nara Lokesh tweets to Chandrababu on Fathers Day
  • నేడు ఫాదర్స్ డే
  • సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి నారా లోకేశ్
  • తండ్రిపై గౌరవాన్ని చాటుకున్న వైనం
నేడు (జూన్ 15) ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబుకు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రే తనకు అన్నీ అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ ప్రత్యేకమైన సందర్భంలో నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తన తండ్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. "నా స్ఫూర్తి... నా గురువు... నా మార్గదర్శకుడు... నా బాస్... హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తండ్రిని తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, అన్ని విధాలా తనకు మార్గనిర్దేశం చేసే శక్తిగా లోకేశ్ అభివర్ణించారు. పితృ దినోత్సవాన లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి


Nara Lokesh
Chandrababu Naidu
Fathers Day
Andhra Pradesh
AP CM
Telugu Desam
Nara Lokesh tweet
Pitrudina Subhakankshalu

More Telugu News