Sonia Gandhi: అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi Admitted to Hospital Due to Illness
  • ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ
  • ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ
  • ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్న వైద్యులు
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో ఈ నెల 9న చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దానికి రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం విదితమే. అధిక రక్తపోటుతో బాధపడిన సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. 
Sonia Gandhi
Sonia Gandhi health
Sir Ganga Ram Hospital
Delhi hospital
Indira Gandhi Medical College
IGMC Shimla
abdominal issues
Congress leader
health problems
hospitalized

More Telugu News