Revanth Reddy: సర్కార్ బడుల్లో ఆధునిక విద్యాబోధనకు ఆరు ప్రముఖ ఎన్‌జీవోలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం

Revanth Reddy Telangana Government Partners with NGOs for Modern Education
  • సర్కార్ బడుల్లో అత్యాధునిక సాంకేతిక బోధనే లక్ష్యం 
  • సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎన్డీవోలతో విద్యాశాఖ ఎంవోయూలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ నిన్న ఆరు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎన్జీఓ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.

నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్న ఎన్జీవోల జాబితాలో ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ప్రత్యేక కార్యదర్శి హరిత, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పాఠశాల విద్యా సంచాలకులు నర్సింహారెడ్డి, త్వరలో పాఠశాల విద్యా సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టనున్న నవీన్ తదితరులు పాల్గొన్నారు. 
Revanth Reddy
Telangana education
government schools
NGO partnership
free education
digital learning
Ek Step Foundation
Prajwala Foundation
Physics Wallah
Khan Academy

More Telugu News