KTR: ఇప్పటికి 3 సార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లైనా వస్తా: కేటీఆర్

KTR Says Will Appear for Investigation Even 30 Times
  • ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
  • ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి కేసు
  • ఏసీబీ ఆఫీసులో విచారణకు మాజీ మంత్రి కేటీఆర్
‘‘విచారణకు రమ్మని ఇప్పటికే మూడుసార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లు పిలిచానా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను అధికారులు విచారణకు పిలిచారు. ఈ రోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవముందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట కేసీఆర్‌, హరీశ్‌రావును కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. ఈ రోజు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే, తాము కేసులకు అరెస్టులకు భయపడే వాళ్లం కాదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR
KTR BRS
Telangana Bhavan
ACB Investigation
Formula One Racing
Corruption Allegations
Revanth Reddy Government
Kaleshwaram Project
BRS Party
Telangana Politics

More Telugu News