Samantha Ruth Prabhu: ఆ సినిమా కోసం సమంత, నాగచైతన్య మళ్లీ కలవనున్నారా?

Will Samantha and Naga Chaitanya Reunite for Ye Maaya Chesave Re Release
  • నాగ చైతన్య – సమంత జంటగా నటించిన ఏమాయ చేశావె మూవీ వచ్చే నెల రీ రిలీజ్
  • వీరిద్దరూ ఒకే వేదికపై కలవనున్నారంటూ సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకారు
నాగ చైతన్య – సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేశావె’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 18న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, సమంత ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కలుస్తారనే చర్చ జరుగుతోంది.

నాగచైతన్య, సమంతలు పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. వీరి విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు.

సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ‘ఏమాయ చేశావె’ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఏమాయ చేశావె’ సినిమా సందర్భంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ చిత్రం ఇద్దరికీ చాలా ప్రత్యేకమైనది కావడంతో రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దాదాపు వీరిద్దరూ కలిసే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా సమంత, చైతన్యలను మళ్లీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
Samantha Ruth Prabhu
Naga Chaitanya
Ye Maaya Chesave
Samantha Naga Chaitanya reunion
Samantha dating
Naga Chaitanya marriage
Shobhita Dhulipala
Raj Nidimoru
Telugu movie re-release
Samantha Naga Chaitanya movie

More Telugu News