Raja Saab: 'రాజాసాబ్' టీజ‌ర్ వ‌చ్చేసింది.. వింటేజ్ ప్రభాస్ లుక్‌కి అభిమానులు ఫిదా!

Prabhas Raja Saab Teaser Released Fans Thrilled by Vintage Look
  • మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌ 'రాజాసాబ్' 
  • న‌వ్వు తెప్పించే డైలాగ్స్‌, హార‌ర్ ఎలివేష‌న్స్‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా టీజ‌ర్ 
  • టీజ‌ర్‌లో ప్ర‌భాస్ వింటేజ్ లుక్ హైలైట్ 
  • డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన డార్లింగ్ ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ టీజ‌ర్ విడుద‌లైంది. క్రేజీ డైరెక్టర్ మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌ లో వస్తున్న కామెడీ హార‌ర్‌ జోనర్ సినిమా ఇది. టీజ‌ర్‌లో ప్ర‌భాస్ వింటేజ్ లుక్ హైలైట్ అని చెప్పాలి. టీజర్‌లో వింటేజ్ ప్రభాస్ లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. న‌వ్వు తెప్పించే డైలాగ్స్‌, హార‌ర్ ఎలివేష‌న్స్‌తో టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. 

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెబ‌ల్ స్టార్ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌విక మోహ‌న్, రిద్ధి కుమార్ న‌టిస్తున్నారు. 'స‌లార్‌', 'క‌ల్కి ఏడీ 2898' వంటి వ‌రుస హిట్ల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన మూవీ కావ‌డంతో 'రాజాసాబ్‌'పై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. 

ఇక‌, తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే.. ఆ అంచ‌నాల‌ను అందుకునేలానే ఉంది. త‌మ‌న్ మ్యూజిక్ ఈ సినిమాకు మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అని చెప్పాలి. టీజ‌ర్‌లో హార‌ర్ ఎలివేష‌న్స్‌ సీన్ల‌కు అదిరిపోయే బీజీఎం ఇచ్చారు త‌మ‌న్‌. థియేట‌ర్ల‌లో ఇది మ‌రింత ప్ర‌త్యేకంగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబ‌ర్ 5న 'రాజాసాబ్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

Raja Saab
Prabhas
Maruthi
Telugu movie
Nidhi Agarwal
Malavika Mohanan
Riddhi Kumar
People Media Factory
Thaman
Horror comedy

More Telugu News