Ambati Rambabu: జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు

Ambati Rambabu Condemns Governments Actions Against YS Jagan
  • జగన్ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని అంబటి మండిపాటు
  • జగన్ బందోబస్తు బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్య
  • చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని ఎద్దేవా
ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళుతుంటే... ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోందని విమర్శించారు. జగన్ అసలు బయటకే రావద్దన్నట్టుగా పోలీసుల వైఖరి ఉందని అన్నారు. 

జగన్ బందోబస్తు ఏర్పాటు బాధ్యత పోలీసులదేనని.... జగన్ పర్యటించొద్దని అనడం కరెక్ట్ కాదని అంబటి చెప్పారు. జగన్ పర్యటనల సందర్భంగా హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని... ఆయన రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.
Ambati Rambabu
Chandrababu Naidu
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
TDP
Naga Malleswara Rao
Political Harassment

More Telugu News