Chandrababu Naidu: చంద్రబాబు గారూ జూనియర్ ఎన్టీఆర్ ఇక రాడు కదా... లోకేశ్ కు బాధ్యతలు అప్పగించండి: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Owaisi Suggests Chandrababu Hand Over Reins to Lokesh
  • చంద్రబాబు, లోకేశ్ ఎంఐఎం అధినేత అసద్ తీవ్ర వ్యాఖ్యలు
  • టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని లేవనెత్తిన ఒవైసీ
  • నారా లోకేశ్ నాయకత్వ పటిమపై అసదుద్దీన్ సందేహాలు
  • బీజేపీతో చంద్రబాబు పొత్తును విమర్శించిన ఎంఐఎం చీఫ్
  • ఏపీ రాజకీయాల్లో ఒవైసీ కామెంట్స్‌తో కొత్త చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల నుంచి విరమించుకుని, ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ కు బాధ్యతలు అప్పగించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన సూచన చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆదోనిలో జరిగిన సభలో ప్రసంగించిన అసదుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాయుడు గారూ, మీకు చెబుతున్నా, మీరు లోకేశ్ భవిష్యత్తును (రాజకీయంగా) నాశనం చేస్తున్నారు. మీ తర్వాత ఎలాగైనా మీ కొడుకే కదా (వారసుడిగా) బాధ్యతలు స్వీకరిస్తాడు... జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా? మీరు లోకేశ్ ను గందరగోళంలో పడేస్తున్నారు" అని ఒవైసీ అన్నారు.

చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేస్తూ, "మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 5 సంవత్సరాలు పనిచేశారు. అది చాలు. ఇప్పుడు మీ కుమారుడి విషయం చూసుకోండి (బాధ్యతలు అప్పగించండి)" అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu
Asaduddin Owaisi
Nara Lokesh
Junior NTR
Andhra Pradesh Politics
MIM
Succession
Political Future
Telugu Desam Party

More Telugu News