Perni Nani: పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్..!

Arrest Warrant Issued Against Perni Nani
  • పేర్ని నానికి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం న్యాయస్థానం
  • 2019లోని ఓ కేసులో సాక్షిగా ఉన్న పేర్ని నాని
  • కోర్టు విచారణ వాయిదాలకు గైర్హాజరైన వైనం
  • నానిపై న్యాయమూర్తి ఆగ్రహం
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. మచిలీపట్నం కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆయనకు పలుమార్లు ఆదేశించినా, ఆయన కోర్టు వాయిదాలకు గైర్హాజరయ్యారు. దీంతో మచిలీపట్నం కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరు పరచాలంటూ పోలీసులను ఆదేశిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేశారు.

తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 
Perni Nani
Perni Nani arrest warrant
Machilipatnam court
YSRCP leader
TDP activists case
Andhra Pradesh politics
Court hearing
NBW warrant

More Telugu News