MV Krishna Reddy: నేడు డీఎస్సీ మైనర్‌ మీడియం పరీక్షల ప్రాథమిక కీ విడుదల

MV Krishna Reddy Announces DSC Minor Medium Key Release
  • డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షకు 95.11 శాతం హాజరు
  • నేటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
  • ఈ నెల 23 వరకు డీఎస్సీ వెబ్ సైటులో అభ్యంతరాలు స్వీకరణ
మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా నిన్న జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 38,243 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 36,372 మంది (95.11 శాతం) హాజరయ్యారని మెగా డీఎస్సీ–2024 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

227 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు ఉదయం అనంతపురం జిల్లాలో (97.84 శాతం), మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో (97.98 శాతం) అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.

మైనర్ మీడియా లాంగ్వేజెస్ ‘కీ’ విడుదల

స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) మైనర్ మీడియా కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక కీ నేటి నుండి https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో, రెస్పాన్స్ షీట్ అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అభ్యర్థులు ప్రాథమిక కీపై తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల 23లోపు వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 
MV Krishna Reddy
AP DSC 2024
DSC Minor Medium Exams
School Assistant Languages Key
AP DSC Key Release
Andhra Pradesh DSC
Education Department AP
APCFSS
Teacher Recruitment

More Telugu News