KTR: కేటీఆర్ అంటే ఒక మహాశక్తి: హరీశ్ రావు

Harish Rao Says KTR is a Great Power
  • కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్న హరీశ్
  • ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ తలవంచరని వ్యాఖ్య
  • తెలంగాణ మొత్తం కేటీఆర్ వెనుక ఉందన్న హరీశ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని... ఒక శక్తి అని అన్నారు. 

కక్షసాధింపుల్లో భాగంగానే కేటీఆర్ పై తప్పుడు కేసులు మోపి, విచారణ పేరుతో తిప్పుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ పాలనలో తాము దగ్గినా, తుమ్మినా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తలవంచే వ్యక్తి కేటీఆర్ కాదని... తెలంగాణ మొత్తం తన వెనుక నిలబడ్డ మహాశక్తి అని అన్నారు. కేటీఆర్ కు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని... కేటీఆర్ ను ముట్టుకున్నవారు భస్మమవుతారని హెచ్చరించారు.
KTR
KT Rama Rao
Harish Rao
Revanth Reddy
BRS
Telangana Politics
Political Vendetta
Telangana Government
Corruption Allegations

More Telugu News