Ismail Fekri: మొస్సాద్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని ఆరోపణ.. ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని ఉరి తీసిన ఇరాన్

- టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ డ్రోన్ల ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్
- ఇరాన్‌లోని కీలక ప్రదేశాలపై దాడులకు మొస్సాద్ ఏజెంట్లు కుట్ర పన్నారన్న ఇరాన్
- ధ్వంసం చేసిన డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి 200 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్న అధికారులు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. రాజధాని టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన ఒక డ్రోన్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు ధ్రువీకరించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌లోని పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి మొస్సాద్ ఏజెంట్లు పేలుడు పదార్థాలతో నింపిన చిన్న డ్రోన్లను మోహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు కూడా తెలిపారు. ధ్వంసం చేసిన డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య మొస్సాద్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడన్న ఆరోపణలపై ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని నిన్న ఇరాన్ ఉరితీసింది.