China: ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక

China Asks Citizens to Leave Israel Immediately
  • ఇరాన్-ఇజ్రాయెల్ భీకర దాడులు
  • ఇజ్రాయెల్‌లో చైనా పౌరులకు అలెర్ట్
  • జోర్డాన్ మీదుగా భూమార్గంలో వెళ్లాలని చైనా రాయబార కార్యాలయం ప్రకటన
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ దాడుల వల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా గణనీయంగా జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది.

తమ పౌరులు తక్షణమే ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలని అక్కడి చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వాయు మార్గం మూసివేయబడినందున, చైనా పౌరులు జోర్డాన్ వైపు ఉన్న భూ సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. పౌరుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై పడుతుండటంతో సామాన్య పౌరులు మరణిస్తున్నారని, అనేక నివాస గృహాలు ధ్వంసమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. హైఫా సహా ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు నిరంతరం మోగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు తమ వాయు రక్షణ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రజలందరూ సురక్షిత ఆశ్రయాల్లోనే ఉండాలని ఐడీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
China
Israel Iran conflict
China citizens Israel
Israel war
Iran attack
Israel evacuation
China embassy
Middle East crisis
Haifa
IDF

More Telugu News