KTR: లొట్టపీసు కేసన్న కేటీఆర్ కు అరెస్ట్ భయమెందుకు?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

Adi Srinivas Criticizes KTRs Reaction to ACB Investigation
  • తప్పు చేయకుంటే కేటీఆర్‌కు భయమెందుకన్న ఆది శ్రీనివాస్
  • కేటీఆర్ ది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా
  • ఏసీబీ విచారణ తర్వాత సంబరాలా? అంటూ మండిపాటు
ఫార్ములా ఈ-రేసు కేసును "లొట్టపీసు కేసు"గా అభివర్ణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేయనప్పుడు అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన గట్టి తీర్పుతో కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా వరుస కేసులతో ప్రజా సేవను పట్టించుకోవడం లేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

ఫార్ములా ఈ-రేసు కేసును తేలిక చేసి మాట్లాడిన కేటీఆర్, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం భయంతో వణికిపోతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరై బయటకు వచ్చిన వెంటనే, బీఆర్ఎస్ వర్గాలు బాణాసంచా కాల్చి కేటీఆర్‌కు స్వాగతం పలకడాన్ని ఆయన తప్పుపట్టారు. "అరెస్ట్ చేయనందుకే ఈ సంబరాలు చేసుకుంటున్నారా?" అని నిలదీశారు. తప్పు చేసిన వారికి రాచమర్యాదలు దక్కుతున్నాయని, బావ, బావమరుదులు ఆలింగనాలు చేసుకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
KTR
K Taraka Rama Rao
Adi Srinivas
BRS
Formula E Race
ACB Investigation
Telangana Politics
Kalvakuntla Family
Government Whip
Corruption Case

More Telugu News