Chevireddy Bhaskar Reddy: బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Chevireddy Bhaskar Reddy Detained at Bangalore Airport
  • లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి
  • చెవిరెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ
  • చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం
వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Chevireddy Bhaskar Reddy
Chevireddy
Bangalore Airport
YSCP
Excise Case
Liquor Case
Andhra Pradesh Politics
Vijayawada SIT
Lookout Notice
Karnataka Police

More Telugu News