Pawan Kalyan: గుడిలో దోపిడీ జరిగినా పట్టించుకోనంత బిజీగా ఉన్నారా పవన్ కల్యాణ్ గారూ!: యాంకర్ శ్యామల

Pawan Kalyan Criticized Over Temple Robbery in Konaseema
  • ముక్తేశ్వరం ఆలయంలో పట్టపగలు దోపిడీ.
  • పవన్ ను టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల
  • సనాతని పవన్‌ పట్టించుకోరా అంటూ వ్యాఖ్యలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రసిద్ధ ఆలయంలో పట్టపగలే దొంగలు చొరబడి లక్షల విలువైన ఆభరణాలను అపహరించుకుపోయిన ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఉదంతంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని గుడిలో పట్టపగలు బంగారం దోపిడీ జరిగినా పట్టించుకోలేనంత బిజీగా ఉన్నారా 'ది సో కాల్డ్ సనాతని' పవన్ కల్యాణ్ గారూ?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ మేరకు దోపిడీ వార్త క్లిప్పింగ్ ను కూడా శ్యామల సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో కొలువైన శ్రీముక్తికాంత క్షణముక్తేశ్వరాలయంలో శుక్రవారం (జూన్ 13) మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. ఆలయం మూసివేసిన సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడిలోని అమ్మవారి మెడలోని బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు లక్షా నలభై వేల రూపాయలు ఉంటుందని ఆలయ వర్గాలు మరియు స్థానికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ ఇన్‌ఛార్జ్ కె. ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలతో పాటు ఇతర కీలక ఆధారాలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Pawan Kalyan
Anchor Shyamala
Andhra Pradesh
temple theft
Mukteswaram temple
Ambedkar Konaseema district
YSRCP
gold robbery
political criticism
crime news

More Telugu News