Air India: వరుస ఘటనలతో భయాందోళన.. అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

- అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దు
- టేకాఫ్‌కు ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు
- జూన్ 12 నాటి ఘోర ప్రమాదం తర్వాత అదే రూట్‌లో తొలి విమానం ఇదే
- ఎయిరిండియా విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. గత వారం ఇదే మార్గంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరువకముందే, మళ్ళీ అదే మార్గంలో వెళ్లే విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం.
ఈ మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరాల్సిన ఎయిరిండియాకు చెందిన ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ లోపం వెలుగుచూసింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
ఈ నెల జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ ఘోర దుర్ఘటనలో ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ విమానం డాక్టర్స్ హాస్టల్‌పై కూలడంతో మరికొంతమంది ఇతరులు మృతి చెందారు.
ఈ విషాద ఘటన అనంతరం, ఎయిరిండియా ఏఐ-171 ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేసి, దాని స్థానంలో ఏఐ-159 నంబరుతో సర్వీసులను నడపాలని నిర్ణయించింది. కాగా, ఆ ప్రమాదం తర్వాత లండన్‌కు షెడ్యూల్ చేయబడిన తొలి విమానం ఇదే కావడం, ఇప్పుడు అదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.