Rayapati Shailaja: ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు: రాయపాటి శైలజ

Rayapati Shailaja Condemns Kuppam Incident as Shameful
  • కుప్పం మండలం నారాయణపురంలో దారుణ ఘటన
  • భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన వైనం
  • బాధితురాలిని వీడియో కాల్‌లో పరామర్శించిన రాయపాటి శైలజ
  • జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక వ్యక్తి చేసిన అప్పు వ్యవహారం ఆయన భార్య పాలిట శాపంగా మారింది. భర్త అప్పు తీర్చలేదన్న కారణంతో భార్యను చెట్టుకు కట్టేసి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

బాధిత మహిళను రాయపాటి శైలజ వీడియో కాల్ ద్వారా పరామర్శించి, జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందుతున్న ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాగరికతకు మాయని మచ్చతెచ్చే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. 
Rayapati Shailaja
Kuppam
Chittoor District
Andhra Pradesh Women Commission
Debt
Wife Assault
Narayanapuram
Crime

More Telugu News