Telangana Government: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ప్రభుత్వ హెల్ప్‌లైన్!

Telangana Government Helpline for Citizens Amid Tensions between Iran and Israel
  • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
  • ఆయా దేశాల్లోని తెలంగాణ పౌరుల సహాయార్థం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్లు
  • అత్యవసర సహాయం కోసం నలుగురు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు విడుదల
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఆయా దేశాలలో నివసిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరుల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా సంప్రదించేందుకు వీలుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నలుగురు కీలక అధికారులను ప్రత్యేకంగా నియమించింది. వారి ఫోన్ నంబర్లను కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సమాచారం కోసం తెలంగాణ పౌరులు సంప్రదించాల్సిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి... వందన, ఐఏఎస్ (పీఎస్‌, రెసిడెంట్ కమిషనర్‌): +91 9871999044, రక్షిత్‌ నాయక్‌ (లైజన్‌ ఆఫీసర్‌): +91 9643723157, జావేద్‌ హుస్సేన్‌ (లైజన్‌ ఆఫీసర్‌): +91 9910014749, సీహెచ్ చక్రవర్తి (పౌర సంబంధాల అధికారి): +91 9949351270 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Telangana Government
Iran Israel conflict
Telangana citizens
Helpline
Middle East crisis

More Telugu News