Palla Srinivasa Rao: పల్లా శ్రీనివాసరావు మాతృమూర్తిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

- సీఎం చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి
- పల్లా తండ్రి సింహాచలం చిత్రపటానికి పుష్పాంజలి
- పల్లా కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి
- విశాఖ-2 ఎమ్మెల్యేగా సింహాచలం సేవలను గుర్తుచేసుకున్న చంద్రబాబు
- సీఎం పరామర్శ తమకు మనోధైర్యాన్ని ఇచ్చిందన్న పల్లా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు స్వగృహానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఇటీవల మరణించిన ఆయన తండ్రి పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు... పల్లా సింహాచలం విశాఖ-2 నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలకు, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాతృమూర్తి మహాలక్ష్మిని, అన్నయ్య పల్లా శంకర్రావును చంద్రబాబు పరామర్శించారు.
ఇటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమ నివాసానికి వచ్చి ఆత్మీయంగా పరామర్శించడం తమ కుటుంబ సభ్యులకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి తాము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని ఆయన సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు. ఈ పరామర్శ తమకు కొండంత అండగా నిలిచిందని ఆయన తెలిపారు.