Nara Lokesh: నేడు, రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన

Nara Lokesh Two Day Delhi Tour Today Tomorrow
  • నేడు 10.30 గంటలకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్
  • సాయంత్రం వరుసగా ముగ్గురు కేంద్ర మంత్రులతో  సమావేశం కానున్న లోకేశ్
  • రేపు కార్మిక శాఖ మంత్రి, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తోనూ భేటీ కానున్న మంత్రి లోకేశ్ 
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన, నేడు, రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఢిల్లీలో లోకేశ్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో లోకేశ్ సమావేశమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.

రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో ఆయన భేటీ అవుతారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో కూడా మంత్రి లోకేశ్ సమావేశం కానున్నారు. 
Nara Lokesh
AP Minister
Delhi Visit
Jagdeep Dhankhar
Chirag Paswan
Dharmendra Pradhan
Arjun Ram Meghwal
Mansukh Mandaviya
Tony Blair
Andhra Pradesh

More Telugu News