Sunitha: ఇది కూడా రాజా రఘువంశీ తరహా విషాదాంతమే!

Sunitha arrested for poisoning husband in Jharkhand
  • వివాహం అయిన 36 రోజులకే భర్తకు భోజనంలో విషం కలిపి హత్య చేసిన భార్య
  • వివాహం అయిన మరుసటి రోజే భర్త అంటే ఇష్టం లేదని పుట్టింటికి వెళ్లిపోయిన సునీత
  • ఇరు కుటుంబాలు పంచాయతీ నిర్వహించి సునీతకు నచ్చజెప్పి కాపురానికి పంపిన వైనం
  • ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేక కడతేర్చిన సునీత
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొఘలాయ హనీమూన్ (రాజా రఘువంశీ) హత్య కేసు మరవకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహం జరిగిన 36 రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ కుమార్తె సునీతకు గత నెల 11న జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వ జిల్లాలోని బహోకుందర్ గ్రామానికి చెందిన బుధ్‌నాథ్ సింగ్‌తో వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన మరుసటి రోజే తనకు భర్త అంటే ఏ మాత్రం ఇష్టం లేదని తెగేసి చెప్పి సునీత పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ నిర్వహించి సునీతకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయితే భర్త అంటే ఇష్టం లేని సునీత అతన్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసింది. గత శనివారం భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. కూరగాయల చెట్లకు మందు కొట్టాలనే సాకుతో భర్తతో పురుగుల మందు కొనిపించింది.

ఆదివారం రాత్రి భర్త తినే భోజనంలో ఆ పురుగుల మందు కలిపి పెట్టినట్లు తెలుస్తోంది. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన బుధ్‌నాథ్ నిద్రలోనే మృతి చెందాడు. మరుసటి రోజు ఉదయం బుధ్‌నాథ్ మృతి చెందాడని తెలుసుకున్న అతని తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
Sunitha
Jharkhand murder case
Garhwa district
poisoning
husband murder
arranged marriage
crime news
India crime
Vishnupur
Budhnath Singh

More Telugu News