Husband: భార్య ఫొటోలతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ.. డబ్బులిచ్చి ఎవరైనా శృంగారం చేయచ్చంటూ భర్త ఆఫర్!

Husband offered wife for sex on fake Instagram ID Delhi High Court denies bail
  • మరిది లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోని భర్త
  • మాట వినడం లేదంటూ బ్లేడుతో చేతిపై కోసిన ప్రబుద్ధుడు
  • హోటల్‌కు తీసుకెళ్లి స్నేహితులతో శృంగారం చేయాలని బలవంతం
  • ఇది మామూలు వైవాహిక వేధింపుల కేసు కాదన్న ఢిల్లీ హైకోర్టు
  • నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ
అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఇతరులతో శృంగారం చేయాలని బలవంతం పెట్టిన భర్తకు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇది సాధారణ వైవాహిక వేధింపుల కేసు కాదని జస్టిస్ గిరీశ్ కథపాలియా పేర్కొన్నారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మరిది తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా భర్త పట్టించుకోకపోవడమే కాకుండా, మాట వినడం లేదంటూ బ్లేడుతో చేతులను గాయపరిచేవాడని, రక్తమోడుతున్నా అలాగే వంట చేయమని చెప్పేవాడని బాధిత మహిళ ఆరోపించింది. అంతేకాకుండా హోటలు గదికి తీసుకెళ్లి స్నేహితులతో శృంగారం చేయమని బలవంతం చేసేవాడని చెప్పింది. అయితే, తాను తప్పించుకుని వచ్చేశానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు ఆమె భర్తపై అత్యాచారం, గ్యాంగ్‌రేప్, లైంగిక వేధింపులు, క్రూరమైన ప్రవర్తన, విశ్వాసాన్ని భంగపరచడం వంటి అభియోగాలు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, నిందితుడు తన భార్య ఫొటోలతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, డబ్బులిచ్చి ఎవరైనా శృంగారంలో పాల్గొనవచ్చని ఆన్‌లైన్‌లో ఆఫర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, అతడిపై నమోదైన అభియోగాల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న ధర్మాసనం బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవి సాధారణ వైవాహిక వేధింపులు కావని వ్యాఖ్యానించింది.
Husband
Wife
Delhi High Court
Fake Instagram ID
Sexual Harassment
Marital Rape
Online Offer
Crime
Justice Girish Kathpalia
Cyber Crime

More Telugu News