Nandigam Suresh: నందిగం సురేశ్ కు అస్వస్థత... అంబులెన్స్ నుంచి వీల్ ఛైర్ లో ఆసుపత్రికి

Nandigam Suresh Falls Ill Admitted to Guntur Hospital
  • గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేశ్
  • టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనే కేసులో రిమాండ్
  • జీజీహెచ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనే కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ సహాయంతో సురేశ్ ను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న నందిగం సురేశ్ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలకు అనుమతించనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు నందిగం సురేశ్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Nandigam Suresh
YSRCP
Guntur
Andhra Pradesh
TDP Activist Attack Case
Guntur GGH Hospital
Health Update
Former MP

More Telugu News