Aishwarya Rajesh: ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ మూవీ చూసితీరవలసిందే!

Aishwarya Rajesh Special
  • ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రగా సినిమా
  • కారుచుట్టూ తిరిగే కథ  
  • ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే 
  • నాన్ స్టాప్ గా నవ్వించే కంటెంట్

తెలుగు .. తమిళ భాషలలో ఐశ్వర్య రాజేశ్ కి ఎంతో క్రేజ్ ఉంది. తమిళంలో ఆమె చేసిన సినిమాలలో కొన్ని ఓటీటీలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో 'సొప్పన సుందరి' ఒకటిగా కనిపిస్తుంది. ఎస్. జి. చార్లెస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఆడియన్స్ మనసులను కొల్లగొడుతూనే ఉంది. బ్లాక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తూనే ఉంటుంది.   

కథ విషయానికి వస్తే .. అహల్య - రాణి అక్కా చెల్లెళ్లు. ఇద్దరూ పెళ్లిళ్లకు సిద్ధంగా ఉంటారు. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రి .. డబ్బు ఆశగల తల్లి .. భార్యమాట వినేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అన్నయ్య .. ఇది వాళ్ల పరిస్థితి. అహల్య ఒక జ్యుయలరీ షాపులో పనిచేస్తూ ఉంటుంది. ఆ షాపువారు లక్కీ డ్రా క్రింద 10 లక్షల ఖరీదు చేసే కారును ప్రకటిస్తారు. తన యజమాని పంపించగా ఆ షాపులో గోల్డ్ తీసుకున్న అహల్య అన్నయ్య, రాయడం రాని కారణంగా కూపన్ ను ఆమెకి ఇస్తాడు. తన పేరును రాసిన అహల్యకి లక్కీ డ్రాలో ఆ కారు తగులుతుంది. 

అహల్య ఆ కారును కట్నంగా ఇచ్చి రాణి పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే ఆ పెళ్లికొడుకు రాణితో పాటు ఆ కారులో వెళ్లి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో శవాన్ని డిక్కీలో పెడతారు. నగలు కొన్నది తాను గనుక కారు తనదే అంటూ అహల్య పైకి అన్నయ్య గొడవకు వస్తాడు. దాంతో డిక్కీలో శవం ఉందని తెలియని పోలీసులు ఆ కారు తీసుకుని స్టేషన్ కి వెళతారు. నగలు కొన్న రసీదు ఎవరు చూపిస్తే వాళ్లకి కారు అప్పగిస్తామని అంటారు. అప్పుడు అహల్య ఏం చేస్తుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

Aishwarya Rajesh
Soppana Sundari
Aishwarya Rajesh movie
Tamil movies
OTT releases
Black comedy movies
Vishal Chandrasekhar
Charles directorial
Hotstar OTT
Tamil cinema

More Telugu News