Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh Keeps His Word to TDP Workers Family
  • వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని హామీ
  • ఇంటిపై తీసుకున్న రుణాన్ని తీర్చిన మంత్రి లోకేశ్‌
  • బాలకోటిరెడ్డి సతీమణికి నెలనెలా ఆర్థికసాయం అందజేత
కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ ఆపదవేళ వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌. గత ప్రభుత్వ పాలనలో రౌడీ మూకల దాడిలో దారుణహత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటాననే హామీని మంత్రి నిలబెట్టుకున్నారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని మంత్రి లోకేశ్‌ తీర్చారు. ఆయన సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు నెలనెలా ఆర్థికసాయం అందజేస్తూ ఇంటికి పెద్దకొడుకులా అండగా నిలిచారు. 

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేశ్‌
అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని ఓర్చుకోలేని గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న బలాకోటిరెడ్డిని తుపాకీతో కాల్చిచంపారు. హత్యకు ఆరు నెలల ముందు కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల 21న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలుపించుకున్న మంత్రి లోకేశ్‌.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆర్థికంగా చాలా నష్టపోయామని, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేశ్‌ నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఉండవల్లి నివాసంలోనూ కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు.  

Nara Lokesh
Venna Balakotireddy
TDP
Andhra Pradesh Politics
Romicherla
Palanadu district
Gopireddy Srinivasareddy
Telugu Desam Party
Political violence
Party workers support

More Telugu News