Sanjay Kevin M: పెళ్లి కోసం గోవాకు.. ప్రియురాలిని అడవిలో గొంతుకోసి చంపిన ప్రియుడు!

Goa Boyfriend Sanjay Kevin M Kills Girlfriend Roshni Moses in Forest
  • యువతి గొంతు కోసి, మృతదేహాన్ని అడవిలో పడేసిన ప్రియుడు
  • హత్య తర్వాత బెంగళూరుకు పారిపోయిన నిందితుడు
  • దక్షిణ గోవాలోని అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యం
  • నిందితుడు సంజయ్ కెవిన్ ఎంను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పెళ్లి చేసుకుందామనే ఆశతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ఓ యువ జంట కథ విషాదాంతమైంది. వారి మధ్య తలెత్తిన ఓ వివాదం చినికి చినికి గాలివానలా మారి ప్రియురాలి ప్రాణాలను బలిగొంది. 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అడవిలో పడేశాడు.

కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంజయ్, రోష్నిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.

సోమవారం సాయంత్రం ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువతిని గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆమె రోష్ని మోసెస్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రతిపాదన, దానివల్ల తలెత్తిన గొడవే ఈ హత్యకు కారణమని దక్షిణ గోవా ఎస్పీ టికమ్ సింగ్ వర్మ తెలిపారు.

మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. వారికి లభించిన కీలక సమాచారం ఆధారంగా నిందితుడిని సంజయ్ కెవిన్‌గా గుర్తించారు. హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.

Sanjay Kevin M
Roshni Moses M
Goa murder
love affair
crime news
Pratap Nagar forest
South Goa
Bengaluru
marriage proposal
Karnataka

More Telugu News