Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం

Sundeep Kishans Grandmother Agnesamma Passes Away
  • సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నేసమ్మ కన్నుమూత
  • విశాఖలో అంత్యక్రియలు పూర్తి
  • 1960లో మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న సందీప్ నాన్నమ్మ, తాతయ్య
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ (88) విశాఖపట్నంలో సోమవారంనాడు కన్నుమూశారు. జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన ఆగ్నేసమ్మ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె విశాఖలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

నిన్న విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రిలో ఆగ్నేసమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ పాల్గొని తన నానమ్మకు నివాళులర్పించారు.

అనంతరం, సందీప్ కిషన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. "నిన్న మేము మా నానమ్మను కోల్పోయాము. మా తాతయ్య కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్ అయితే, నానమ్మ ఆగ్నెస్ వైజాగ్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. 1960ల నాటి వారి మతాంతర ప్రేమ ఓ సినిమా కథలాంటిది. పెళ్లి తర్వాత తాతయ్య జోసెఫ్ కృష్ణం నాయుడుగా, నానమ్మ ఆగ్నెస్ లక్ష్మిగా మారారు. నాకు తెలిసిన అతి గొప్ప ప్రేమకథ వాళ్లది. మిస్ యూ నానమ్మ.. లవ్ యూ" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

Sundeep Kishan
Sundeep Kishan grandmother
Sripadam Agnesamma
Visakhapatnam
Tollywood
Obituary
Death
Funeral
Government School Headmistress
Interfaith Love Story

More Telugu News