Chevireddy Bhaskar Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్

Chevireddy Bhaskar Reddy Remanded for 14 Days in AP Liquor Scam
  • లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హజరుపర్చిన సిట్ అధికారులు
  • జులై 1వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం
  • నిందితులు విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుకు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మొన్న రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడులను బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చిన సిట్ అధికారులు తమ కార్యాలయంలో నిన్న మూడు గంటలకు పైగా విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

లిక్కర్ స్కామ్ కేసులో ముడుపులను చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాలకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడుకు జులై 1 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. 
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
YSRCP
Andhra Pradesh
Liquor Case
ACB Court
Venkatesh Naidu
Vijayawada
AP SIT

More Telugu News