YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం .. వైసీపీ కార్యకర్త అరెస్టు

YS Jagan Palnadu Tour Controversy YSRCP Activist Arrested
  • జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుల ప్రదర్శన
  • వైసీపీ కార్యకర్త రవితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిబంధనల ఉల్లంఘనపైనా కేసు నమోదుకు చర్యలు 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు ప్రదర్శించిన ఆ పార్టీకి చెందిన కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో నిన్న జగన్ పర్యటన సందర్భంగా 88 తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ అనే వైసీపీ కార్యకర్త వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించాడు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ప్రదర్శించడంపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు జగన్ పర్యటనలో అనుమతి నిబంధనలు ఉల్లంఘించడంపైనా పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇదివరకే చెక్ పోస్టు వద్ద బారికేడ్లు తొలగించడంతో పాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. 
YS Jagan
Jagan Palnadu Tour
Palnadu
Andhra Pradesh Politics
YSRCP
TDP
Ambati Rambabu
Rentapalla

More Telugu News