Sonam Raghuvanshi: సోనమ్ ఫోన్ లో మారుపేరుతో ప్రియుడి నంబర్.. 39 రోజుల్లో 234 కాల్స్

Sonam Raghuvanshi Used Alias Sanjay Verma For Boyfriend Raj Kushwaha
  • హనీమూన్ మర్డర్ కేసులో ‘సంజయ్ వర్మ’ మిస్టరీ తేల్చిన పోలీసులు
  • రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ కాల్ డేటాలో కీలక విషయాలు
  • రాజ్ కుశ్వాహా నంబర్ ను "సంజయ్ వర్మ" పేరుతో సేవ్ చేసుకున్న సోనమ్
  • హత్యకు ప్లాన్ వేసింది ప్రియుడు రాజ్ కుష్వాహానేనని పోలీసుల వెల్లడి
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో "సంజయ్ వర్మ" అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు.

ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను "సంజయ్ వర్మ" పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా సోనమ్, సంజయ్ వర్మ అలియాస్ రాజ్ కుశ్వాహాలు ఫోన్ లో మాట్లాడుకున్నారని, 39 రోజుల వ్యవధిలో 234 సార్లు ఫోన్ చేసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, "సంజయ్ వర్మ" గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. "ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది" అని ఆయన అన్నారు. రాజా హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇండోర్‌కు చెందిన రాజా, సోనమ్‌లకు మే 11న వివాహం జరిగింది. సోనమ్, తన కుటుంబ ఫర్నిచర్ యూనిట్ అకౌంటెంట్ రాజ్‌తో అప్పటికే సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంట, మే 23న నాంగ్రియాట్ గ్రామంలోని హోంస్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. సోనమ్ జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమై నందగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. అంతకుముందే కిరాయి హంతకులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీలను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.
Sonam Raghuvanshi
Meghalaya honeymoon murder case
Raja Raghuvanshi
Raj Kushwaha
Sanjay Verma
honeymoon murder
crime news
India crime
murder for hire
Ghaziapur

More Telugu News