YS Sharmila: జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల

YS Sharmila criticizes Jagan over betting suicides
  • బెట్టింగ్ లకు పాల్పడిన వారి కుటుంబాలకు పరామర్శలా అని షర్మిల ప్రశ్న
  • బెట్టింగ్ లకు పాల్పడిన వారికి విగ్రహాలు కట్టడమేమిటని మండిపాటు
  • బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారన్న షర్మిల
తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్ లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్ లకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని... వీరి మరణాలకు కారణమెవరని ప్రశ్నించారు. బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సింది బలప్రదర్శనలు కాదని... ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు.
YS Sharmila
YS Jagan
Andhra Pradesh
AP Congress
Betting suicides
Political criticism
Government accountability
Public safety
Political rallies
Andhra Pradesh politics

More Telugu News