Uttam Kumar Reddy: సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

CR Patil Assures Meeting on Godavari Project Dispute
  • పాటిల్ ను కలిసిన రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు
  • ఇద్దరు సీఎంలతో మీటింగ్ ఏర్పాటు చేస్తానన్న కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారని వెల్లడించారు. 
Uttam Kumar Reddy
Telangana
Godavari Banakacharla Project
Revanth Reddy
CR Patil
Andhra Pradesh
Water Resources
Interstate Disputes

More Telugu News