Janhvi Kapoor: లండన్ లో బోయ్ ఫ్రెండ్ తో కలిసి కెమెరాకు చిక్కిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor spotted with boyfriend in London
  • బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో లండన్‌లో జాన్వీ కపూర్
  • వీరిద్దరూ వీధుల్లో తిరుగుతుండగా వీడియో తీసిన ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లండన్ వీడియో
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి లండన్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో, ఆ సమయాన్ని ఆమె తన ప్రియుడితో గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ జంట ముంబైలోని రెస్టారెంట్ల వద్ద, తిరుమల శ్రీవారి దర్శన సమయంలోనూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వీధుల్లో కలిసి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఎవరో అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ప్రైవసీ కోసం లండన్ వెళ్లినా, అభిమానుల కంటపడకుండా జాన్వీ తప్పించుకోలేకపోయారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పెద్ది'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, జాన్వీ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 
Janhvi Kapoor
Shikhar Pahariya
Janhvi Kapoor boyfriend
London
Ram Charan
Bollywood actress
Viral video
Relationship
Tirumala
Janhvi Kapoor movies

More Telugu News