Sai Pallavi: కుబేర సినిమా విడుదల సందర్భంగా సాయిపల్లవి స్పందన

- ధనుష్, నాగార్జునల ‘కుబేర’ చిత్రంపై నటి సాయి పల్లవి స్పందన
- సినిమాలో అనేక ప్రత్యేకతలున్నాయని వెల్లడి
- ధనుష్, నాగార్జున పాత్రలు అద్భుతంగా ఉంటాయని వ్యాఖ్య
- రష్మిక పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని ప్రశంస
- దర్శకుడు శేఖర్ కమ్ములను గురువుగా అభివర్ణించిన సాయి పల్లవి
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నటి సాయి పల్లవి సినిమాపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో విశేషాలు ఉన్నాయని, ఇది టీమ్ అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.
సాయి పల్లవి మాట్లాడుతూ, "‘కుబేర’ ఎంతో ప్రత్యేకమైన చిత్రం. సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గారిని ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు పండుగే. రష్మిక పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి కెరీర్‌లోని ఉత్తమ ఆల్బమ్‌లలో ఇది ఒకటి అవుతుంది" అని పేర్కొన్నారు.
ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి చెబుతూ, "నాకెంతో ఇష్టమైన దర్శకుడు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. వారిలో నేనూ ఒకదాన్ని. నా గురువుగారు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని కోరుకుంటున్నాను" అని సాయి పల్లవి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ ప్రశంసలు దక్కాలని ఆమె అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు నిర్మించారు.